ప్రతిరోజూ పండగే ఐదు రోజుల వసూళ్లు

ప్రతిరోజూ పండగే ఐదు రోజుల వసూళ్లు

ప్రతిరోజూ పండగే ఐదు రోజుల వసూళ్లు

 

మెగా హీరో సాయి ధరమ్ తేజ్- రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే రోజున మరో మూడుసినిమాలు విడుదలైనప్పటికీ చివరిగా పోటీలో ‘ప్రతిరోజూ పండగే’ విజేతగా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది..

 

 

తెలుగు రాష్ట్రాలలో ‘ప్రతిరోజూ పండగే’ మొదటి ఐదు రోజులకు రూ. 12.63 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా రూ. 14.73 కోట్ల షేర్ సాధించింది. ‘వెంకీమామ’ జోరు తగ్గడం.. క్రిస్మస్ రోజున రిలీజ్ అయిన కొత్త సినిమాల్లో ఒకటి తుస్సుమనిపించడం.. మరొకటి మల్టిప్లెక్స్ సినిమా కావడంతో ‘ప్రతిరోజూ పండగే’ జోరు బాక్స్ ఆఫీసు దగ్గర ఇంకా కొనసాగుతోంది.

 

Tags:

Share this post

Post Comment