కొడుకు పెళ్లి గురించి అసలు విషయం చెప్పిన బన్నీ తల్లి..!

కొడుకు పెళ్లి గురించి అసలు విషయం చెప్పిన బన్నీ తల్లి..!

అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. ఒకరు మాస్టర్ అయాన్ .. మరొకరు బేబీ అర్హ. అప్పుడప్పుడు వీళ్ళ అల్లరి చేస్తున్న ఫోటోలు, ఆడుకుంటున్న వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు అల్లు అర్జున్, స్నేహారెడ్డి. అయితే బన్నీ, స్నేహ లది ప్రేమ వివాహమే కాదు.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా..! మరి వీరి వివాహానికి పెద్దలు ఎలా అంగీకరించారు? అనే విషయాల్ని ఇటీవల బన్నీ అమ్మగారు అయిన నిర్మల గారు తెలియజేసారు.

 

 

 

కొడుకు పెళ్లి గురించి అసలు విషయం చెప్పిన బన్నీ తల్లి..!

 

వాస్తవానికి బన్నీ.. స్నేహాను ప్రేమిస్తున్నట్టు అలాగే పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నట్టు ముందు ఆమె తల్లి.. నిర్మల గారితోనే చెప్పాడట. అప్పుడు ఆమె ‘నీ సంతోషమే మాకు ముఖ్యం.. మేము చూసిన అమ్మాయి అయినా నీకు నచ్చితేనే చేస్తాను.. ఇప్పుడు నువ్వే ఓ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాను అని చెప్పావ్.. అదే చాలా సంతోషకరం’ అంటూ జవాబిచ్చిందట. ఇక అల్లు అరవింద్ గారు విషయం తెలుసుకుని 5 నిమిషాల్లో డిస్కస్ చేసి.. ఓకే చేసేసారట. అలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ని చాలా సింపిల్ గా ఓకే చేయించుకున్నాడు మన అల్లు అర్జున్.

 

కాగా ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, జయరామ్, సునీల్, సుశాంత్, నివేథా పేతురాజ్, నవదీప్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. ఈ మూవీపై ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

 

Also, Read:

Tags:

Share this post

Post Comment