అల వైకుంఠపురం లో టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్..

అల వైకుంఠపురం లో టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. మాస్ కథాంశాలతో పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టీజర్ రిలీజ్ అయిన ఏడు నిమిషాల్లోనే 1 మినియన్ వ్యూస్ రావడం విశేషం. తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు.

 

అల వైకుంఠపురంలో టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్..

 

 

 

స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ముఖ్యంగా బన్నీ ఈ టీజర్ లో “నువ్వు ఇప్పుడే కార్ దిగావ్, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా” అని చెప్పే డైలాగ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల అవుతోంది.

 

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 

If you can get the latest more film news and updates, you can follow on your android mobile apps.

Tags:

Share this post

Post Comment